Loading...
Premada Oorali OTT: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.150 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి కన్నడ సెన్సేషన్!
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.150 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి కన్నడ సెన్సేషన్!

Premada Oorali OTT: కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.150 కోట్ల వసూళ్లు.. ఓటీటీలోకి కన్నడ సెన్సేషన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2026
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు సంచలన విజయాలు సాధిస్తూ.. రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం మలయాళ చిత్ర పరిశ్రమలో తరచూ కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు కన్నడ సినిమాలు కూడా ఇదే తరహాలో అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అలా తక్కువ బడ్జెట్‌తో భారీ విజయాన్ని అందుకున్న కన్నడ చిత్రమే 'ప్రేమద ఊరలి'. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ మ్యూజికల్ డ్రామాకు మనోజ్ కుమార్ దర్శకత్వం వహించారు. రంగాయన రఘు, శ్రీరామ్, తపస్విని ప్రధాన పాత్రల్లో నటించారు.

వివరాలు

రూ.2 కోట్లతో తెరకెక్కి.. రూ.150 కోట్లకు పైగా వసూల్లు

ఈ ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన 'ప్రేమద ఊరలి' తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ మంచి ఆదరణ పొందింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు.

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే రూ.100 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది.

ఆ తర్వాత రూ.150 కోట్ల మార్కును కూడా దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అంతేకాదు.. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన భారీ వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.

వివరాలు

బలమైన కథ ఉంటే బడ్జెట్‌తో పనిలేదని నిరూపణ

భారీ బడ్జెట్, వివిధ భాషలకు చెందిన స్టార్‌ నటీనటులు, పెద్ద ఎత్తున ప్రచారం లేకపోయినా.. బలమైన కంటెంట్‌తో చిన్న సినిమా కూడా ఏ స్థాయిలో విజయం సాధించగలదో 'ప్రేమద ఊరలి' మరోసారి నిరూపించింది.

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

ఫ్యామిలీ ఎమోషన్స్, మ్యూజికల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా ఓటీటీలోనూ ఆకట్టుకునే అవకాశముంది.

ADVERTISEMENT