Akhand 2: రిలీజ్‌కు ఒకరోజు ముందే అఖండ 2.. హైప్ పెంచుతున్న మేకర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ'కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం 'అఖండ 2'పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. అత్యంత భారీ బడ్జెట్‌తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ కాబోతోంది.
Details
ప్రమోషన్స్ వేగం పెరిగింది
రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ, చిత్ర బృందం ప్రమోషన్లలో స్పీడ్‌ను పెంచింది. ఈ క్రమంలోనే ఈరోజు సాయంత్రం బెంగళూరులో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది.
Details
ఒకరోజు ముందే పైడ్ ప్రీమియర్స్ ప్లాన్
ఇటీవలి రోజుల్లో పెద్ద-చిన్న చిత్రాలకు సంబంధం లేకుండా రిలీజ్‌కు ఒకరోజు ముందే పైడ్ ప్రీమియర్స్ వేయడం ట్రెండ్‌గా మారింది. టాక్ బాగుంటే ఓపెనింగ్ డే వసూళ్లు భారీగా పెరుగుతాయి. టాక్ సరిగా లేకపోతే వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే విధంగా 'అఖండ 2' కోసం కూడా డిసెంబర్ 4నే పైడ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించిన టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రత్యేక అనుమతులు (జీవో) వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కంటెంట్‌పై మేకర్స్‌లో భారీ నమ్మకం ఉండటంతో ప్రీమియర్స్ ప్లాన్ పట్ల ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని టాక్.