Chiranjeevi: చిరంజీవి బర్త్‌డేకు డబుల్ ట్రీట్.. ఒకే రోజున రెండు సర్‌ప్రైజ్‌లు!
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆగస్టు 22న డబుల్ ట్రీట్ అందనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అదే రోజు చిరంజీవి నుంచి మరో సర్‌ప్రైజ్ కూడా ఉండనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న 'విశ్వంభర' చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ను కూడా అదే రోజున వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా
వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ భారీ వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
'విశ్వంభర' చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.