Page Loader
KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత
గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత

KP Chowdary : గోవాలో అత్మహత్య చేసుకున్న ప్రముఖ నిర్మాత

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరి (కృష్ణప్రసాద్‌) ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఆయన గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు అక్కడకు చేరుకొని ఆయన మృతిచెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్‌ చౌదరి. 2016లో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటించిన 'కబాలి' తెలుగు వెర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాక, పలు తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశారు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'అర్జున్‌ సురవరం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు నిర్వర్తించారు.

Details

గోవాలో పబ్ ను ప్రారంభించిన కేపీ చౌదరి

నిర్మాతగా పెద్దగా విజయం సాధించలేకపోవడంతో కేపీ చౌదరి గోవాలో ఓమ్‌ పబ్ ప్రారంభించారు. అయితే, అక్కడ కూడా ఆర్థిక నష్టాలు ఎదురయ్యాయి. ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో, ఆయన సెలబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన వరలక్ష్మీ టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు.