Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ ఫ్యాన్స్‌కు పండుగే.. 'మన శంకరవరప్రసాద్‌గారు' ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, హిట్‌మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్‌గారు' (Mana Shankara Vara Prasad Garu) ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరుస్తోంది. ఈ చిత్రంలో నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందే ప్రమోషన్ వేగం పెంచిన చిత్ర బృందం, ఆదివారం తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రైలర్‌ను విడుదల చేసింది.
Details
ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన
తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే అనిల్ రావిపూడి స్టైల్‌కు తగ్గట్టుగా కామెడీ టచ్‌తో పాటు, చిరంజీవి అభిమానులు ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్‌ను కూడా పుష్కలంగా జోడించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి స్పందన పొందుతున్నాయి. మొత్తం మీద కమర్షియల్ హంగులతో, పండుగ వాతావరణానికి సరిపోయే పూర్తి వినోదాత్మక చిత్రంగా 'మన శంకరవరప్రసాద్‌గారు' రూపొందుతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.