LOADING...
RC17: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. రామ్ చరణ్-సుకుమార్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!
ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. రామ్ చరణ్-సుకుమార్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!

RC17: ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్.. రామ్ చరణ్-సుకుమార్ మూవీ నుంచి బిగ్ అప్డేట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2026
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో రంగస్థలం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెటూరి నేపథ్యంతో ఎమోషన్స్, మాస్ అంశాలను అద్భుతంగా మేళవించి దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం, రామ్ చరణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. 'చిట్టిబాబు' పాత్రలో చరణ్ నటన, సుకుమార్ మేకింగ్ స్టైల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ డైనమిక్ కాంబో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. #RC17 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా ఆసక్తికర అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

వివరాలు

జులై నుంచి షూటింగ్ సందడి

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది జులైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మైత్రీ నిర్మాతల్లో ఒకరు ధృవీకరించారు. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసి, తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. 'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ మూవీ కావడంతో, ఈసారి సుకుమార్ మరింత కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని సమాచారం. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనుంది.

వివరాలు

'రంగస్థలం' మ్యాజిక్ మళ్లీ?

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' (2018) బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. చరణ్‌లోని అసలైన నటుడిని బయటకు తీసిన చిత్రంగా నిలిచింది. వసూళ్ల పరంగా మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలు, జాతీయ అవార్డులు కూడా అందుకుంది. అందుకే #RC17పై అంచనాలు భారీగా పెరిగాయి.

Advertisement

వివరాలు

'పెద్ది'తో ముందుగా ఎంట్రీ

ఇక పెద్ది చిత్రంతో రామ్ చరణ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి రూపొందిన ఈ సినిమా, 1980ల ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. జూన్ 4న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో చరణ్ 'పెద్ది పెహిల్వాన్' పాత్రలో కనిపించనుండగా, జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 'చికిరి చికిరి', 'రైరై రారా' పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మొత్తంగా రామ్ చరణ్ తన రాబోయే చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement