
అశోక్ గల్లా 2 గ్లింప్స్ వీడియో: మీసం మేలేస్తున్న మహేష్ బాబు మేనల్లుడు
ఈ వార్తాకథనం ఏంటి
హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, ఆ సినిమాతో సరైన గుర్తింపు పొందలేకపోయాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన హీరో సినిమా, బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు.
ప్రస్తుతం అశోక్ గల్లా నుండి రెండవ సినిమా వస్తోంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు అశోక్ గల్లా పుట్టినరోజు కాబట్టి, ఈ సినిమాలోంచి చిన్నపాటి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసారు.
ఇందులో పూర్తి యాక్షన్ మోడ్ లో ఉన్నాడు అశోక్ గల్లా. బురదలో జరిగే ఫైట్ సీన్ లో అవతలి వాళ్లను కిందపడేసి, మీసం మెలేస్తూ కనిపించాడు. చూస్తుంటే యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అశోక్ గల్లా రెండవ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్
Continuing onwards and looking forward to all your love and support as always🤗
— Ashok Galla (@AshokGalla_) April 5, 2023
Here's the First Action of my next #AshokGalla2 :)
- https://t.co/3uZpQjEuTk @ArjunJandyala @PrasanthVarma @balasomineni #BheemsCeciroleo #PrasadMurella @saimadhav_burra @lalithambikaoff pic.twitter.com/jenRTVQNTj