
#SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు
ఈ వార్తాకథనం ఏంటి
మహేష్ బాబు 28వ సినిమా గురించి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి తాజాగా రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది.
2024 జనవరి 13వ తేదీన మహేష్ బాబు 28వ సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే విడుదల తేదీ ప్రకటించారు కానీ సినిమా టైటిల్ ప్రకటించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.
మహేష్ బాబు 28వ సినిమా టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయమై సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థకు చెందిన నాగవంశీ స్పందించారు.
#SSMB 28 టైటిల్ లాంచ్ కోసం మే 31వ తేదీ వరకు వేచి ఉండాలని తెలియజేసాడు.
మహేష్
కృష్ణ పుట్టినరోజున టైటిల్ రిలీజ్
మే 31వ తేదీన కీ. శే కృష్ణగారి జన్మదినం. సాధారణంగా ఆయన పుట్టినరోజున మహేష్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అదే రోజున టైటిల్ రివీల్ అయ్యే అవకాశం ఉందని, నాగవంశీ అదే విషయం చెప్పి ఉంటాడని అనుకుంటున్నారు.
మొత్తానికి మహేష్ 28వ సినిమా టైటిల్ కోసంమరో రెండు నెలలు వెయిట్ చేయక తప్పదన్నమాట.
అదలా ఉంచితే మహేష్ బాబు 28వ సినిమా షూటింగ్, చకచకా జరుగుతోంది. హైదరాబాద్ లోని స్టూడియో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీలీల మరో హీరోయిన్ గా కనిపిస్తుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.