Anaganaga Oka Raju : గ్రాండ్ గా 'అనగనగా ఒక రాజు'తో ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఈ వార్తాకథనం ఏంటి
మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సాధించిన స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన కొత్త చిత్రం 'అనగనగా ఒక రాజు'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పకులుగా ఉన్నారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, సంగీతం మిక్కీ జె మేయర్ అందిస్తున్నారు. జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం పండగ వాతావరణంలో ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది.
వివరాలు
రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక
ఇప్పటికే ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం.ఇక తాజాగా మరో వైవిధ్యమైన వేడుకను నిర్వహించింది చిత్ర బృందం. హైదరాబాద్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో మంగళవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను 'రాజు గారి పెళ్లి రిసెప్షన్ వేడుక' పేరుతో ఘనంగా నిర్వహించారు. పాత్రికేయ మిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేసి, అందరికి హాస్యం పంచారు. ఈ వేడుకలో, నాయకనాయికలు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, 'భీమవరం బాల్మా','రాజు గారి పెళ్లిరో' పాటలపై వేదికపై నృత్యం చేసి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. అనంతరం, ప్రత్యేక అతిథులందరికీ స్వాగతం పలికారు, నిజంగా పెళ్లి రిసెప్షన్ వాతావరణం సృష్టించారు.
వివరాలు
నూతన వధూవరులుగా నవీన్ పొలిశెట్టి,మీనాక్షి చౌదరి
వేడుకలో మరొక ప్రత్యేక ఆకర్షణగా, నవీన్ పొలిశెట్టి,మీనాక్షి చౌదరి వేదికపై నూతన వధూవరులుగా దర్శనమిచ్చారు. పాత్రికేయులు,బంధుమిత్రులు ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి జంటను ఆశీర్వదిస్తూ, గిఫ్టులు అందజేసి, సరదాగా ప్రశ్నలు అడిగే విధంగా కార్యక్రమం సాగింది. ఇలా ఈ వేడుక కొత్తగా, వినోదంగా ప్రేక్షకులకు, మీడియాకు, అభిమానులకు మధుర అనుభూతిని ఇచ్చింది.