తదుపరి వార్తా కథనం

Chiranjeevi:విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కసరత్తులు..సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న వీడియో
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 01, 2024
04:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే, ఈ సినిమా కోసం చిరు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
మరో వైపు మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఆయనకు పలువురి నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవి చేసిన ట్వీట్
Gearing up .. And raring to go #Vishwambhara pic.twitter.com/VeUj0yhN35
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2024