Page Loader
Venky-nani : వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?
వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

Venky-nani : వెంకటేష్-నాని కలయికలో భారీ సినిమా.. త్రివిక్రమ్ ప్లాన్ ఇదేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 30, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించిన తర్వాత విక్టరీ వెంకటేష్ కొంత విరామం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కథలు వింటున్నా, ఇప్పటివరకు ఎలాంటి సినిమా ఫిక్స్ చేయలేదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అయితే టాలీవుడ్‌లో తాజాగా ఓ ఆసక్తికర గాసిప్ హల్‌చల్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్ ఓ స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం స్క్రిప్ట్ డిస్కషన్లు జరుగుతున్నాయని సమాచారం. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు. వెంకటేష్ సరసన మరో స్టార్ హీరో నటించనున్న మల్టీస్టారర్ ప్రాజెక్ట్ అని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వెంకీ మహేష్ బాబు, వరుణ్ తేజ్‌లతో మల్టీస్టారర్స్ చేసిన సంగతి తెలిసిందే.

Details

చర్చల  దశలో ప్రాజెక్టు

ఈసారి నేచురల్ స్టార్ నాని‌తో కలిసి వెంకటేష్ నటించబోతున్నారని సమాచారం. ఈ కాంబినేషన్‌ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ మైథాలజికల్ మూవీకి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. అయితే బన్నీ, అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఏడాది పాటు కొనసాగనున్న నేపథ్యంలో మధ్యలో త్రివిక్రమ్ వెంకీ-నాని ప్రాజెక్ట్‌ని పూర్తి చేసే అవకాశం ఉందని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉంది. అధికారిక ప్రకటన రాగానే ఈ వార్తలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.