LOADING...
Oscars: ఆస్కార్‌ దిశగా కీలక అడుగు.. హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు
ఆస్కార్‌ దిశగా కీలక అడుగు.. హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు

Oscars: ఆస్కార్‌ దిశగా కీలక అడుగు.. హోంబలే ఫిల్మ్స్‌ నుంచి రెండు భారీ సినిమాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
01:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన రెండు చిత్రాలు పోటీలో నిలవనున్నాయి. ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల రేసులో ఉన్న 'కాంతార: చాప్టర్‌-1' (Kantara Chapter 1), 'మహావతార్‌ నరసింహ' (Mahavathar Narasimha) చిత్రాలు మరో కీలక ముందడుగు వేశాయి. ఈ రెండు సినిమాలు ఆస్కార్‌ అవార్డుల జనరల్‌ ఎంట్రీలో చోటు దక్కించుకున్నాయి. దీంతో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాలతో పాటు నిర్మాత, స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ వంటి పలు కీలక కేటగిరీల్లో ఈ చిత్రాలు పోటీపడే అర్హతను సాధించాయి. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్‌ అధికారికంగా ప్రకటిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేసింది.

Details

మార్చి 15న  98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 

ఆస్కార్‌కు ఇంకా రెండు అడుగుల దూరంలో ఉన్నామని పేర్కొంది. ఇదిలా ఉండగా 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. ఈ వేడుక అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ నగరంలో ఉన్న ప్రతిష్ఠాత్మక డాల్బీ థియేటర్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఆస్కార్‌ బరిలో నిలిచే చిత్రాల తుది జాబితాను 2026 జనవరి 22న అకాడమీ ప్రకటించనుంది. అలాగే 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన చిత్రాలు ఈ 98వ ఆస్కార్‌ అవార్డులకు అర్హత పొందనున్నాయి. దీంతో హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ రెండు సినిమాలపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement