సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ని, బాహుబలి సినిమాల స్ఫూర్తితో కేజీఎఫ్ ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఎలా చూపించబోతున్నాడోనని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా సలార్ సినిమా టీజర్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమా టీజర్ డేట్ ఫిక్స్ అయిందంటూ రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. తాజాగా మరోసారి సలార్ సినిమా టీజర్ రిలీజ్ తేదీపై న్యూస్ వచ్చింది.
జులై 7న సలార్ టీజర్ రిలీజ్?
సలార్ సినిమా టీజర్, జూలై 7వ తేదీన రిలీజ్ అవుతుందని, ఈ మేరకు మేకర్స్ ఫిక్స్ అయ్యారని సోషల్ మీడియాలో ఊహగానాలు వస్తున్నాయి. మరి ఈసారి వచ్చిన వార్తల్లో నిజం ఉందా లేదా తెలియాలంటే మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సిందే. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది. జగపతిబాబు, మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పూర్తి యాక్షన్ సినిమాగా ఉండబోతున్న సలార్ సినిమాలో అభిమానులను ఆశ్చర్యపరిచే అనేక అంశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తో మతి పోగొట్టే దృశ్యాలు ఉండనున్నాయని సమాచారం వస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతోంది.