
28 Degrees Celsius: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త చిత్రం.. స్ట్రీమింగ్ మొదలైంది
ఈ వార్తాకథనం ఏంటి
పొలిమేర' సిరీస్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈసారి మరో థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
నవీన్ చంద్ర హీరోగా నటించిన '28 డిగ్రీస్ సెల్సియస్' (28 Degrees Celsius) చిత్రం ఇటీవల ఏప్రిల్ 4న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ను అందుకుంది.
ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా ఓటిటి అరంగేట్రం చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
Details
కథలోకి వెళితే
కార్తిక్ (నవీన్ చంద్ర) మెడికల్ చదువుతున్న సమయంలో అంజలి (షాలిని)ను ప్రేమించేస్తాడు. అనాథ అయిన కార్తిక్‌తో పెళ్లికి అంజలి కుటుంబం అంగీకరించకపోవడంతో, ఇద్దరూ ఇంటిని వదిలి పెళ్లి చేసుకుంటారు.
పెళ్లి తర్వాత అంజలికి అనూహ్య ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆమె ఆరోగ్యం కేవలం 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే చక్కబడుతుంది. అయితే అనుకోకుండా ఒక రోజు అంజలి మరణిస్తుంది.
అసలు అంజలి నిజంగా చనిపోయిందా? కార్తిక్ జీవిస్తున్న ఇంట్లో జరుగుతున్న విచిత్ర ఘటనల వెనుక మిస్టరీ ఏమిటి? అన్నదే సినిమాకి ముడిపడి ఉంటుంది.
ప్రియదర్శి, వైవా హర్ష్, షాలిని కీలక పాత్రల్లో నటించి, సినిమాకు బలం చేకూర్చారు. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రం సస్పెన్స్ ప్రేమికులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.