Ghattamaneni JayaKrishna: మహేశ్‌బాబు కుటుంబం నుంచి కొత్త హీరో.. జయకృష్ణ హీరోగా కొత్త మూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్‌స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేశ్‌బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే కొంతకాలంగా జయకృష్ణ సినీ ఎంట్రీపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది. 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అజయ్ భూపతి సోషల్ మీడియాలో విడుదల చేశారు. తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Details
త్వరలోనే టైటిల్ ప్రకటన
అలాగే సినిమా టైటిల్‌ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏంటంటే, మహేశ్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం 'రాజకుమారుడు' కూడా అశ్వనీదత్ నిర్మాణంలోనే రూపొందింది. ఇప్పుడు ఆయన సమర్పణలోనే రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం కావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.