Loading...
Ram Charan: సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్.. ఆమె ఎవరంటే?
సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్.. ఆమె ఎవరంటే?

Ram Charan: సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ సరసన కొత్త హీరోయిన్.. ఆమె ఎవరంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో 'రంగస్థలం' సృష్టించిన ప్రభంజనం గుర్తుకొస్తుంది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతుండటంతో 'RC 17'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప 2' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, మరోవైపు 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ ఎంచుకున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ చిత్రంపై ప్రకటన నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రధాన కథానాయిక ఎంపికకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

వివరాలు

సాత్విక వీరవల్లిపై సుకుమార్ దృష్టి?

సాధారణంగా సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకే పరిమితం కావు. కథను మలుపు తిప్పేలా, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే బలమైన పాత్రలను ఆయన రూపొందిస్తుంటారు.

గతంలో 'రంగస్థలం'లో రామలక్ష్మిగా సమంత పోషించిన పాత్ర ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే.

ఇప్పుడు 'RC 17'లోనూ కథానాయిక పాత్ర భావోద్వేగభరితంగా, కథలో అత్యంత కీలకంగా ఉండబోతోందని సమాచారం.

తొలుత ఈ పాత్ర కోసం సారా అర్జున్ పేరును పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఆమె గతంలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించడంతో, ఇప్పుడు స్టార్ హీరో సరసన పూర్తిస్థాయి కథానాయికగా పరిచయం చేస్తే ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే అంశంపై చిత్రబృందం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

వివరాలు

త్వరలో లుక్ టెస్ట్.. అధికారిక ప్రకటన తర్వాతే!

ఈ పాత్రకు అద్భుతమైన నటనతోపాటు తెలుగు భాషపై మంచి పట్టు, సహజమైన డైలాగ్ డెలివరీ అవసరమని సుకుమార్ భావిస్తున్నారట.

అందుకే ఇతర భాషల నటీమణుల కంటే తెలుగు మూలాలున్న ప్రతిభావంతురాలికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో సహజ నటనతో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్న సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది.

ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, భావోద్వేగాలను పలికించే తీరు సుకుమార్ బృందాన్ని ఆకట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ పక్కన సాత్విక కొత్త జోడీగా కనిపిస్తే తెరపై సరికొత్తదనం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలో త్వరలో హైదరాబాద్‌లో ఆమెకు ప్రత్యేకంగా లుక్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం

చరణ్ సరసన ఆమె జోడీ ఎంతవరకు సరిపోతుందో పరిశీలించిన తర్వాతే కథానాయిక ఎంపికపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి.

సినిమాలోని తన పాత్ర కోసం రామ్ చరణ్ పూర్తిస్థాయి మేకోవర్‌కు సిద్ధమవుతున్నారు. బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ సహా అన్ని అంశాల్లోనూ కొత్త లుక్‌లో కనిపించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ సాత్విక వీరవల్లి ఎంపిక ఖరారైతే, చాలా కాలం తర్వాత ఓ భారీ పాన్ ఇండియా స్టార్ ప్రాజెక్ట్‌లో తెలుగు మూలాలున్న నటికి ప్రధాన కథానాయికగా అవకాశం దక్కినట్లవుతుంది.

దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

ADVERTISEMENT