Love Jathara : న్యూ ఇయర్‌లో కొత్త ప్రేమ కథ.. 'లవ్ జాతర'తో రాబోతున్న యంగ్ జంట
ఈ వార్తాకథనం ఏంటి
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అంకిత్ కొయ్య... క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో, బ్యూటీ వంటి సినిమాలతో హీరోగా ప్రేక్షకులను మెప్పించిన ఆయన... ఇప్పుడు కొత్త సంవత్సరాన్ని మరో కొత్త చిత్రంతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. అంకిత్ కొయ్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లవ్ జాతర' (Love Jathara). ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. యూజీ క్రియేషన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
Details
పోస్టర్ కు అద్భుతమైన స్పందన
'సమ్మతమే' ఫేమ్ దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం 'లవ్ జాతర' రెగ్యులర్ షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తిస్థాయి రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించబోతుందని చిత్ర బృందం తెలిపింది. అంకిత్ కొయ్య కెరీర్‌లో మరో కీలకమైన చిత్రంగా ఇది నిలవనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.