Page Loader
గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్ 
గుంటూరు కారం సినిమా నుండి మహేష్ బాబు పోస్టర్ విడుదల

గుంటూరు కారం నుండి మరో పోస్టర్: చొక్కా బటన్లు విప్పేసిన సూపర్ స్టార్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 09, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు నుండి గుంటూరు కారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా, పోస్టర్ ని రిలీజ్ చేసారు. తాజాగా మరోమారు మరొక పోస్టర్ ని వదిలారు. ఈ పోస్టర్ లో చొక్కా బటన్లు విప్పేసి, విలన్ల ముందు నిల్చున్న మహేష్ బాబు కనిపించాడు. తలకు కారం రంగు కండువా కట్టుకుని విలన్ల ముందు నిల్చున్నాడు మహేష్. వరుసగా రిలీజైన పోస్టర్లు చూస్తుంటే, త్రివిక్రమ్ తన స్టయిల్ ని పూర్తిగా మార్చేసినట్లు అర్థమవుతోంది. పూర్తి మాస్ దర్శకుడిగా మారిపోయి మాస్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల ఫీమేల్ మెయిన్ లీడ్ లో కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి మరొక హీరోయిన్ గా నటిస్తుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుంటూరు కారం సినిమా పోస్టర్ ని విడుదల చేస్తూ నిర్మాణ సంస్థ ట్వీట్