Loading...
Varanasi Update: రాజమౌళి కెరీర్‌లో సరికొత్త రికార్డు.. 'ఆర్ఆర్ఆర్‌'ను దాటేసిన 'వారణాసి'!
రాజమౌళి కెరీర్‌లో సరికొత్త రికార్డు.. 'ఆర్ఆర్ఆర్‌'ను దాటేసిన 'వారణాసి'!

Varanasi Update: రాజమౌళి కెరీర్‌లో సరికొత్త రికార్డు.. 'ఆర్ఆర్ఆర్‌'ను దాటేసిన 'వారణాసి'!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుగుతుందనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఉంది. సాధారణంగా ఇతర దర్శకులు కొన్ని నెలల్లోనే సినిమా పూర్తి చేస్తే.. రాజమౌళి మాత్రం తన చిత్రాల కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుంటారు. 'బాహుబలి' సిరీస్, 'ఆర్ఆర్ఆర్' సినిమాలు ఇందుకు పెద్ద నిదర్శనం. అయితే ఈసారి మాత్రం జక్కన్న తన ట్రేడ్‌మార్క్‌కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. 'వారణాసి' ప్రాజెక్ట్‌ను ఊహించని వేగంతో ముందుకు తీసుకెళ్తున్నారు. సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయినట్లు రాజమౌళి స్వయంగా వెల్లడించారు.

వివరాలు

606 రోజుల్లోనే పూర్తి

సెప్టెంబర్ 28న నిర్వహించిన ప్రత్యేక క్యూ అండ్ ఏ సెషన్‌లో 'వారణాసి'కి సంబంధించిన పలు అంశాలపై ఆయన మాట్లాడారు.

అయితే వీటిలో సినిమా షూటింగ్ జరుగుతున్న వేగం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి గత చిత్రం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ మొత్తం 1011 రోజుల పాటు కొనసాగింది.

2018 నవంబర్ 19న ప్రారంభమైన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్.. 2021 ఆగస్టు 26న పూర్తయింది. అయితే 'వారణాసి' మేజర్ షూటింగ్ మాత్రం 606 రోజుల్లోనే పూర్తయినట్లు తెలుస్తోంది.

2025 జనవరి 24న ప్రారంభమైన 'వారణాసి' షూటింగ్.. 2026 సెప్టెంబర్ 22 నాటికి పూర్తయినట్లు సమాచారం.

వివరాలు

తక్కువ సమయంలో పూర్తి

దీంతో షూటింగ్ వ్యవధి పరంగా 'వారణాసి' కొత్త రికార్డు నెలకొల్పినట్లే. అత్యంత భారీ స్థాయిలో, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న 'వారణాసి' సినిమాను ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, విస్తృతమైన సెట్స్‌తో సినిమా తెరకెక్కుతున్నప్పటికీ.. రాజమౌళి షూటింగ్‌ను ఇంత వేగంగా పూర్తి చేయడంపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది

ADVERTISEMENT

వివరాలు

ఏప్రిల్ 7న రిలీజ్

ఇక మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర నిర్మాణ పనులను కూడా వేగంగా పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

ఇప్పటికే మహేష్‌ బాబు లుక్, రాజమౌళి టేకింగ్, భారీ నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

'వారణాసి'లో మహేష్‌ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ADVERTISEMENT