LOADING...
PVCU:ప్రశాంత్‌ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్‌ హీరో మూవీ 'అధీర' ఫస్ట్‌ లుక్‌!
ప్రశాంత్‌ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్‌ హీరో మూవీ 'అధీర' ఫస్ట్‌ లుక్‌!

PVCU:ప్రశాంత్‌ వర్మ నుంచి నయా సర్ప్రైజ్ .. సూపర్‌ హీరో మూవీ 'అధీర' ఫస్ట్‌ లుక్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ (PVCU) నుంచి ప్రతేడాది ఒక సినిమా విడుదల చేస్తామని ముందే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన యూనివర్స్‌లో రాబోయే కొత్త చిత్రం 'అధీర' (Adhira)పై ఆసక్తికర అప్‌డేట్‌ను షేర్‌ చేశారు. ఇందులో ఎస్‌.జే. సూర్య (S. J. Suryah), కళ్యాణ్‌ దాసరి ప్రధాన పాత్రల్లో నటించనున్నారని వెల్లడించారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు... వెలుగు రూపంలో ఆశాకిరణం పుట్టుకొస్తుందనే కాన్సెప్ట్‌తో 'అధీర' పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రాబోతుందని, దీనికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారని చెప్పారు.

Details

చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది

త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను బయట పెడతామని తెలిపారు. ప్రశాంత్ వర్మ తన PVCU ప్రణాళికలో ఇప్పటికే 20 స్క్రిప్ట్‌లు సిద్ధం అవుతున్నాయని, మొదటి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని ఇంతకుముందే ప్రకటించారు. ఇందులో భాగంగా 'మహాకాళి' (Mahakali)ని ఇప్పటికే పరిచయం చేశారు. "మా యూనివర్స్‌కి కొత్త శక్తి చేరింది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోల శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నామని ఆయన తెలిపారు. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 'అధీర' గ్లింప్స్‌ను పవన్ కళ్యాణ్‌ నటించిన 'ఓజీ' సినిమాలో చూపించాలన్న ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.