Ram Charan : అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది.
ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్ లిస్టులో రామ్ చరణ్‌కు చోటు దక్కింది.
ఈ మేరకు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేసింది.
ఇక టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కు అరుదైన గౌరవం లభించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలోని యాక్టర్స్ బ్రాంచ్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే.
Details
రామ్ చరణ్ తో పాటు మరో ఏడుగురికి యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు
రామ్ చరణ్‌తో పాటు మరో ఏడుగురు నటులు యాక్టర్స్ బ్రాంచ్‌లో చేరారు.
ఇలా సభ్యత్వం తీసుకున్న వారంతా ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచిన పోటీదారులకు ఓటు వేసే అవకాశం ఉంది.
రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
తమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.