Loading...
Zombie Reddy 2: 'జాంబీ రెడ్డి 2' నుంచి అదిరిపోయే అప్డేట్‌.. ఉపేంద్ర ఫస్ట్ లుక్‌ వైరల్!
'జాంబీ రెడ్డి 2' నుంచి అదిరిపోయే అప్డేట్‌.. ఉపేంద్ర ఫస్ట్ లుక్‌ వైరల్!

Zombie Reddy 2: 'జాంబీ రెడ్డి 2' నుంచి అదిరిపోయే అప్డేట్‌.. ఉపేంద్ర ఫస్ట్ లుక్‌ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

తేజ సజ్జ కెరీర్‌లో 'హనుమాన్‌'కు ముందు వచ్చిన 'జాంబీ రెడ్డి' (Zombie Reddy) ఎంత ప్రత్యేకమైన చిత్రమో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జాంబీ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి స్పందన లభించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్‌ వరుస అప్డేట్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్‌ అవేటెడ్‌ సీక్వెల్‌ 'జాంబీ రెడ్డి 2' (Zombie Reddy 2) నుంచి తాజాగా మరో కీలక అప్డేట్‌ వచ్చింది.

వివరాలు

ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్

కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 18, 2026న ఆయనకు సంబంధించిన పవర్‌ఫుల్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ హై-స్టేక్స్‌ యాక్షన్‌-కామెడీ చిత్రంలో ఉపేంద్ర సరికొత్త, వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

మాస్‌, మ్యాడ్‌నెస్‌ కలగలిసిన పవర్‌హౌస్‌ పాత్రలో ఆయన ప్రేక్షకులను అలరించనున్నట్లు వెల్లడించారు.

వివరాలు

సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న పోస్టర్

ఉపేంద్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదలైన వెంటనే సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

ఈ పోస్టర్‌ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఉపేంద్ర పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

ADVERTISEMENT

వివరాలు

హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సీక్వెల్

'జాంబీ రెడ్డి' తొలి భాగం రాయలసీమ గ్రామీణ నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే.

అయితే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ కథ పూర్తిగా హైదరాబాద్‌ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది.

చార్మినార్‌ వంటి హైదరాబాద్‌లోని ఐకానిక్‌ లొకేషన్లను కూడా కథలో భాగంగా చూపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ షనాయా కపూర్‌ టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

'ది ఫ్యామిలీ మ్యాన్‌' ఫేమ్‌ సుపర్ణ్‌ ఎస్‌. వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. గౌర హరి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఏయే భాషల్లో విడుదల?

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో నిర్మిస్తున్న 'జాంబీ రెడ్డి 2' షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, నేపాలీ, జపనీస్‌ భాషల్లో 2027లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

అయితే తేజ సజ్జ పాత్రతో పాటు ఉపేంద్ర పోషిస్తున్న రోల్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్‌ ఇంకా వెల్లడించలేదు.

దీంతో సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్‌తో 'జాంబీ రెడ్డి 2'పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది.

మరి తేజ సజ్జ, ఉపేంద్ర కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ ఎలాంటి జాంబీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ADVERTISEMENT