Loading...
Nayanthara: వరుస ఫ్లాపులతో నయనతారకు షాక్.. లేడీ సూపర్ స్టార్‌కు ఇప్పుడు హిట్ తప్పనిసరా?
వరుస ఫ్లాపులతో నయనతారకు షాక్.. లేడీ సూపర్ స్టార్‌కు ఇప్పుడు హిట్ తప్పనిసరా?

Nayanthara: వరుస ఫ్లాపులతో నయనతారకు షాక్.. లేడీ సూపర్ స్టార్‌కు ఇప్పుడు హిట్ తప్పనిసరా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లేడీ సూపర్ స్టార్' అనే బిరుదు, కోట్ల రూపాయల రెమ్యునరేషన్, చేతినిండా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ నయనతారకు ఇటీవల ఎదురవుతున్న సినిమా ఫలితాలు తీవ్ర నిరాశను మిగులుస్తున్నాయి. హీరోయిన్‌గా నటించినా, నిర్మాతగా సినిమాలు నిర్మించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం దక్కడం లేదు. ఒకప్పుడు నయనతార సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద ప్రత్యేకమైన క్రేజ్ కనిపించేది. కానీ ప్రస్తుతం ఆ క్రేజ్ వసూళ్లుగా మారడంలో విఫలమవుతోంది. స్టార్ హీరోయిన్‌గా తనకున్న మార్కెట్‌ను నిలబెట్టుకోవడంలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అనే సందేహాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి.

వివరాలు

వరుస పరాజయాలతో నిరాశ

ఈ ఏడాది తెలుగులో విడుదలైన 'మన శంకర్ వరప్రసాద్ గారు' మినహా ఆమె నటించిన మరే ఇతర చిత్రం కూడా ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

ముఖ్యంగా సుందర్ సి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ వచ్చిన 'మూకుర్తి అమ్మన్ 2' (మహాశక్తి) బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.

మొదటి భాగం ఓటీటీలో ఘనవిజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ హైప్ ఏర్పడింది. అయితే థియేటర్లలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకులపై ఆశించిన ప్రభావం చూపలేకపోయింది.

మరోవైపు కవిన్‌తో కలిసి నటించిన 'హాయ్' చిత్రం కూడా థియేట్రికల్ సక్సెస్‌ను అందుకోలేకపోయింది.

వీటికి తోడు యష్ నటించిన 'టాక్సిక్' చిత్రంలో నయనతార కీలక పాత్ర పోషించినప్పటికీ.. ఆ సినిమా ఫలితం కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచింది.

వివరాలు

భవిష్యత్ ప్రాజెక్టులపైనే ఆశలు

వరుస పరాజయాలు ఎదురవుతున్న నేపథ్యంలో నయనతార చేతిలో ఉన్న భవిష్యత్ ప్రాజెక్టులపై అందరి దృష్టి నెలకొంది.

మలయాళ స్టార్ నివిన్ పౌలీతో కలిసి నటిస్తున్న 'డియర్ స్టూడెంట్స్', దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నయనతార 81', పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న 'రక్కాయి' చిత్రాలపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది.

ముఖ్యంగా 'రక్కాయి'లో నయనతార సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించనుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలతో తిరిగి విజయాల బాట పట్టాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

రజినీ, సల్మాన్ ఖాన్ సినిమాలపై భారీ అంచనాలు

వీటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేయనున్న 'ధర్మన్' ప్రాజెక్ట్, సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రానున్న భారీ బాలీవుడ్ చిత్రం కూడా నయనతార కెరీర్‌లో అత్యంత కీలకంగా మారనున్నాయి.

ప్రస్తుతం నయనతారకు ఒక భారీ హిట్ అనేది కేవలం అవసరం మాత్రమే కాదు. బాక్సాఫీస్ వద్ద తన 'లేడీ సూపర్ స్టార్' హోదాను మరోసారి నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరి రాబోయే సినిమాలతో ఆమె తిరిగి విజయాల బాట పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT