LOADING...
The Great Pre Wedding Show : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!
'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!

The Great Pre Wedding Show : 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'తో నవ్వుల వర్షం.. పక్కా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో ప్రేక్షకులు కామెడీ సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. ఈ తరహాలో తాజాగా విడుదలైన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. 'మసూద', 'పరేషాన్' చిత్రాలతో విజయాలు సాధించిన తిరువీర్, ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించగా, నరేంద్ర రవి, యామిని భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. బై 7PM, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అశ్మితా రెడ్డి నిర్మాణంలో, రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ లభించింది. కథ విషయానికి వస్తే —ఒక ఫోటోగ్రాఫర్, పెళ్లికి సిద్ధమవుతున్న ఓ జంటకు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు.

Details

థియేటర్లలో ఫ్యామిలీతో చూసేందుకు సరైన సినిమా

కానీ ఆ ఫుటేజ్ ఉన్న చిప్ పోయిన తర్వాత జరిగే సంఘటనలతో కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. మొత్తం సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో పాటు భావోద్వేగాన్ని కలగలిపి సాగుతుంది. 'లిటిల్ హార్ట్స్' తర్వాత వచ్చిన ఉత్తమ కామెడీ చిత్రాలలో ఇది ఒకటని ప్రేక్షకులు చెబుతున్నారు. ఎలాంటి బూతులు లేకుండా, శుద్ధమైన వినోదాన్ని అందించింది. తిరువీర్ అమాయకమైన ఫోటోగ్రాఫర్ పాత్రలో అద్భుతంగా నవ్వించాడు. మిగతా నటీనటులంతా కూడా తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. థియేటర్లలో ఫ్రెండ్స్‌, ఫ్యామిలీతో చూసేందుకు సరైన సినిమా అని ప్రేక్షకులు అంటున్నారు. చిన్న సినిమా కావడంతో ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ, మౌత్ టాక్‌తో రోజురోజుకీ బుకింగ్స్ పెరుగుతున్నాయి. 'మసూద', 'పరేషాన్' తర్వాత తిరువీర్‌కు మరో హిట్ దక్కిందని చెప్పొచ్చు.