Happy brithday Sandeep Reddy Vanga: ఓటమి ఎరుగని దర్శకుడు.. సందీప్ రెడ్డి వంగా సక్సెస్ మంత్రం ఇదే!
'యానిమల్' విడుదల తర్వాత దేశవ్యాప్తంగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు మార్మోగుతోంది. తనకు నచ్చినట్లు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇప్పటివరకూ ఆయన తీసింది మూడు సినిమాలే అయినా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇవాళ్టితో 41 వసంతాలు పూర్తి చేసుకొని 42వ ఏట సందీప్ రెడ్డి వంగా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సందీప్ రెడ్డి మొదటి సినిమా 'అర్జున్ రెడ్డి'తోనే బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందుకున్నాడు. చక్కటి ప్రేమ కథను బోల్ట్‌గా చూపించి సక్సెస్ అయ్యారు. అదే కథను బాలీవుడ్ ప్రేక్షకులకు 'కబీర్ సింగ్'తో పరిచయం చేసి, హిట్‌ను అందుకున్నాడు.
యానిమల్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా
ఇక యానిమల్ సినిమాతో ఇండియన్ ఫిల్మ్‌ను షేక్ చేశారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్‌ను బోల్డ్‌గా అత్యంత వయలెన్స్ తో చూపించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది. ఈ మూవీతో తెలుగు పవర్‌ను సందీప్ రెడ్డి ప్రపంచానికి చాటారు. సందీప్ రెడ్డితో సినిమాలు చేసేందుకు బడా హీరోలతో పాటు, బడా నిర్మాణ సంస్థలు ఆసక్తిని చూపిస్తాయి. 'మనసు మాట వినదు' చిత్రానికి అప్రెంటిస్‌గా మొదట పని చేశారు. తర్వాత 'కేడీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశారు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'అర్జున్ రెడ్డి' (2017) సినిమాతో దర్శకుడిగా మారి, సంచలన విజయాలకు కేంద్ర బిందువుగా మారాడు.