LOADING...
Hook Step song: కోపం వ‌ల్ల వ‌చ్చిన స్టెప్‌.. థియేటర్లను దద్దరిల్లిస్తున్న 'హుక్ స్టెప్' వెనుక ఉన్న‌ కథ ఇదే!
కోపం వ‌ల్ల వ‌చ్చిన స్టెప్‌.. థియేటర్లను దద్దరిల్లిస్తున్న 'హుక్ స్టెప్' వెనుక ఉన్న‌ కథ ఇదే!

Hook Step song: కోపం వ‌ల్ల వ‌చ్చిన స్టెప్‌.. థియేటర్లను దద్దరిల్లిస్తున్న 'హుక్ స్టెప్' వెనుక ఉన్న‌ కథ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
09:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్‌గారు'. నయనతార కథానాయికగా నటించగా, వెంకటేశ్ కీలక పాత్రలో మెప్పించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటన, అనిల్ రావిపూడి టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి చేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా 'హుక్ స్టెప్' సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఆ స్టెప్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ హిట్ స్టెప్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని కొరియోగ్రాఫర్ 'ఆట' సందీప్ తాజాగా వెల్లడించారు.

Details

ఈఎంఐ కట్టాలని  వరుసగా ఫోన్లు 

సినిమాను థియేటర్‌లో వీక్షించిన అనంతరం ఆయన ఈ స్టెప్ రూపుదిద్దుకున్న విధానాన్ని వివరించారు. మన అందరికీ సమస్యలు ఉంటాయి. ప్రతి నెలా ఈఎంఐలు కట్టాల్సిందే. ఈ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న సమయంలో ఈఎంఐ కట్టాలని గుర్తు చేస్తూ వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. సాధారణంగా కంపోజింగ్ సమయంలో నేను ఫోన్ తీసుకెళ్లను. కానీ, ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ తీసుకెళ్లాల్సి వచ్చింది. లోపలికి వెళ్లాక కూడా ఫోన్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. కోపం వచ్చి ఫోన్ పగలకొట్టేద్దామనుకున్నా. అదే సమయంలో ఫోన్ చేతిలోకి తీసుకున్న వెంటనే ఒక్కసారిగా ఒక ఐడియా తళుక్కున వచ్చింది.

Details

నా భార్య కూడా చప్పట్లు కొట్టారు

వెంటనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, కేవలం ఫోన్ లైట్ వేసుకుని 'హుక్ స్టెప్' కంపోజ్ చేశాను. అది చూసిన నా భార్య కూడా చప్పట్లు కొట్టారు. ఆ స్టెప్‌ను మరింత డెవలప్ చేసి, ఇప్పుడు మీరు సినిమాలో చూస్తున్న ఫైనల్ స్టెప్‌ను సిద్ధం చేశాం. చిరంజీవిగారి గ్రేస్‌ను దృష్టిలో పెట్టుకొని ఆ స్టెప్‌ను డిజైన్ చేశామ‌ని తెలిపారు. అలాగే, సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత చిరంజీవితో జరిగిన ఓ భావోద్వేగ క్షణాన్ని కూడా సందీప్ గుర్తు చేసుకున్నారు. సాంగ్ షూట్ పూర్తయిన తర్వాత చిరంజీవిగారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఏమీ తెలియనట్లుగా నా దగ్గరకు వచ్చారు. 'అబ్బాయ్..! నీ వల్ల నాకు పేరు వచ్చేలా ఉందన్నారు

Advertisement

Details

కష్టపడే వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం.

. దానికి నేను 'సర్.. మీ పేరు చెప్పుకునే మేమంతా ఇక్కడికి వచ్చాం' అన్నాను. వెంటనే ఆయన 'నిన్ను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉందన్నారు. ఆ మాటలు చిరంజీవి గారి నోట వినడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్లను తీసుకురాగలరు. కానీ నన్ను నమ్మారు. కష్టపడే వాళ్లకు అవకాశం ఇవ్వాలన్నదే ఆయన ఉద్దేశం. మాలాంటి కళాకారులకు అవకాశమిచ్చారు. థ్యాంక్యూ అంటూ భావోద్వేగంతో చెప్పారు.

Advertisement