Akkineni Akhil: 'అయ్యగారే నెంబర్ వన్' ఫ్యాన్‌కు సర్‌ప్రైజ్.. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న అఖిల్!
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని అఖిల్ మరోసారి తన అభిమానులపై ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నారు. సోషల్ మీడియాలో 'అయ్యగారే నెంబర్ వన్' అనే నినాదంతో గుర్తింపు పొందిన గుంటూరుకు చెందిన వీరాభిమాని నాగరాజును కలిసి, గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య చోటుచేసుకున్న భావోద్వేగ క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల విడుదలైన 'లెనిన్' సినిమా సందర్భంగా నాగరాజు థియేటర్ల వద్ద చేసిన సందడి అందరి దృష్టిని ఆకర్షించింది. అఖిల్ కటౌట్‌కు పాలాభిషేకం చేయడం, కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొట్టాయి. అవి అఖిల్ దృష్టికి చేరడంతో, అవకాశం వచ్చినప్పుడు నాగరాజును తప్పకుండా కలుస్తానని ఆయన మాట ఇచ్చారు.
వివరాలు
భావోద్వేగానికి గురైన అభిమాని
తాను ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ఇటీవల నాగరాజును ప్రత్యేకంగా తన వద్దకు ఆహ్వానించారు. అభిమాన హీరోను ఎదురుగా చూసిన నాగరాజు ఆనందాన్ని ఆపుకోలేక భావోద్వేగానికి గురయ్యాడు.
వెంటనే అఖిల్ కాళ్లపై పడేందుకు ప్రయత్నించగా, ఆయన ప్రేమగా వారించి ఆలింగనం చేసుకున్నారు.
ఆ ఆప్యాయతకు కదిలిపోయిన నాగరాజు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ జన్మకు ఇది చాలు అన్నా అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
గుంటూరులో రోడ్డు పక్కన పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే నాగరాజు, అఖిల్ సినిమా విడుదలైనప్పుడల్లా తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటుంటాడు.
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు వచ్చినప్పటికీ దాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా, ఇతర హీరోల అభిమానులతో ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండటం అతని ప్రత్యేకతగా చెప్పొచ్చు.
వివరాలు
ప్రశంసలు కురిపిస్తున్న అభిమానులు
ఈ భావోద్వేగ భేటీకి సంబంధించిన వీడియోను అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో అది క్షణాల్లోనే వైరల్ అయింది.
స్టార్ హీరో అయినప్పటికీ అభిమానిని ఇంత ఆప్యాయంగా ఆదరించిన అఖిల్‌పై నెటిజన్లు, సినీ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటనతో అఖిల్ తన అభిమానుల హృదయాల్లో మరింత ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
The most famous "Ayyagare"...
— Annapurna Studios (@AnnapurnaStdios) July 15, 2026
Finally met his favourite "Ayyagaru." ❤️
A moment worth every celebration... and one that will be remembered for a long time 🫶🏻@AkhilAkkineni8 #Nagaraju#Lenin #BlockbusterLenin pic.twitter.com/HFejwxbew7