Chiranjeevi-Venkatesh: చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్‌లో సర్ప్రైజ్ సాంగ్… అనిల్ రావిపూడి ఆసక్తికర రివీల్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, ఘనమైన కామెడీ టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావనున్న ఈ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇంతలో ఈ సినిమాలో మెగాస్టార్‌తో పాటు విక్టరీ వెంకటేష్ కూడా ముఖ్య అతిథి పాత్రలో కనిపించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
Details
20 నిమిషాలు పాటు తెరపై వెంకటేష్
తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇచ్చిన వివరాలు సినిమా హైప్‌ను మరింత పెంచాయి. చిరంజీవి వింటేజ్ క్యారెక్టర్‌లో కనిపించడం ప్రేక్షకులకు పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని తెలిపారు. వెంకటేష్ ఈ సినిమాలో మొత్తం 20 నిమిషాల పాటు ఉండే ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు అని వెల్లడించారు. అంతేకాదు, చిరంజీవి-వెంకటేష్ మధ్య ఓ ప్రత్యేక గీతాన్ని కూడా తెరకెక్కించారని అనిల్ వెల్లడించడం అభిమానుల్లో ఉత్సాహం రేపింది. ఇద్దరూ కలిసి చేసిన ఆ సాంగ్ ఆడియన్స్‌కు పక్కా సర్ప్రైజ్. ఇద్దరూ డాన్స్‌తో ఒక రేంజ్‌లో కిక్ ఇచ్చారు. పాట రికార్డ్‌లు బ్రేక్ చేస్తుంది" అంటూ అనిల్ అన్నారు.
Details
వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ ఈ వార్తపై భారీగా సంబరాలు జరుపుతున్నారు. రామ్ చరణ్-ఎన్టీఆర్‌ల 'నాటు నాటు' ఏ స్థాయిలో ట్రెండ్ అయిందో, ఇదీ అదే రేంజ్‌లో నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని స్పెషాలిటీస్‌తో వస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించనున్న పాన్ ఇండియా మూవీ 'విశ్వంభర' వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశముంది.