LOADING...
Tom Cruise: టామ్ క్రూజ్‌తో తెలుగు దర్శకుడి సినిమా? హాలీవుడ్‌లో హాట్ టాపిక్!
టామ్ క్రూజ్‌తో తెలుగు దర్శకుడి సినిమా? హాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Tom Cruise: టామ్ క్రూజ్‌తో తెలుగు దర్శకుడి సినిమా? హాలీవుడ్‌లో హాట్ టాపిక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

టామ్ క్రూజ్ నటించిన మిషన్: ఇంపాజిబుల్ సిరీస్ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఫ్రాంచైజ్‌తో టామ్ క్రూజ్ గ్లోబల్ స్టార్‌గా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన 'డిగ్గర్' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ హాలీవుడ్ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉండగా, టామ్ క్రూజ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు హాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఆయన డూపెల్గాంగర్ అనే స్పై థ్రిల్లర్ చిత్రంలో నటించే అవకాశమున్నట్లు సమాచారం.

వివరాలు

అనీష్ చాగంటి తెరకెక్కించే అవకాశం

ఈ చిత్రాన్ని తెలుగు మూలాలున్న యువ దర్శకుడు అనీష్ చాగంటి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని హాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో విడుదలైన 'సర్చింగ్' సినిమాతో అనీష్ చాగంటి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అనీష్ చాగంటి, డాన్ ఫ్రే కలిసి రాసిన 'డూపెల్‌గాంగర్' స్క్రిప్ట్‌ను పారామౌంట్ పిక్చర్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ స్పై థ్రిల్లర్ కథను టామ్ క్రూజ్‌కు అనీష్ వినిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై వీరిద్దరి మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిగినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి టామ్ క్రూజ్ నుంచి సూత్రప్రాయ అంగీకారం కూడా లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement