LOADING...
Beauty: ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా.. 8.8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న సినిమా!
ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా.. 8.8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న సినిమా!

Beauty: ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా.. 8.8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న సినిమా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 02, 2026
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

థియేటర్లలో విడుదలైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా ఓటీటీలోకి రావడం విశేషంగా మారింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా మరోసారి ప్రేక్షకులను చేరుకుంటోంది. థియేటర్లలో పెద్దగా స్పందన రాకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Details

 'బ్యూటీ' ఓటీటీ రిలీజ్ డేట్

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన తెలుగు రొమాంటిక్ మూవీ 'బ్యూటీ (Beauty)' శుక్రవారం జనవరి 2 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. నిజానికి ఈ చిత్రం గతంలోనే టీవీ ప్రీమియర్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడున్నర నెలల గ్యాప్ తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. సాధారణంగా సినిమాలు ముందుగా ఓటీటీలో విడుదలై, ఆ తర్వాత టీవీలోకి వస్తాయి. అయితే 'బ్యూటీ' విషయంలో ఈ క్రమం పూర్తిగా రివర్స్ అయింది.

Details

'బ్యూటీ' మూవీ విశేషాలు

'బ్యూటీ' ఓ లో-బడ్జెట్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. గతేడాది సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే విమర్శకుల నుంచి మాత్రం మంచి రివ్యూలు అందుకున్నది. అంతేకాదు, ఐఎండీబీ వెబ్‌సైట్‌లో ఈ సినిమాకు 8.8 రేటింగ్ నమోదవడం విశేషం. ఈ చిత్రంలో సీనియర్ నటులు నరేష్‌, వాసుకితో పాటు అంకిత్‌, నీలఖి వంటి కొత్త నటీనటులు కీలక పాత్రలు పోషించారు. జేఎస్ఎస్ వర్దన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ భావోద్వేగాలకు, సున్నితమైన ప్రేమకథకు కాస్త సస్పెన్స్‌ను జోడించి రూపొందించారు.

Advertisement

Details

కథాంశం ఇదే

ఈ సినిమా అలేఖ్య, అర్జున్ మధ్య ప్రేమ కథ చుట్టూ సాగుతుంది. అదే సమయంలో అలేఖ్య కోసం ఆమె తండ్రి నారాయణ (నరేష్) చూపించే అపారమైన ప్రేమ కూడా కథలో ప్రధానంగా ఉంటుంది. కాలేజీలో చదువుతున్న అలేఖ్య ఓ పెట్ ట్రైనర్ అయిన అర్జున్‌ను ప్రేమిస్తుంది. ఒకరోజు అలేఖ్య అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో తండ్రి నారాయణ తీవ్రంగా కలత చెందుతాడు. అలేఖ్య అర్జున్‌తో వెళ్లిపోయిన తర్వాత వారి జీవితంలోకి ఓ రౌడీ ముఠా కూడా ప్రవేశిస్తుంది. అసలు ఆ ముఠాతో వాళ్లకు ఉన్న సంబంధం ఏమిటి? అలేఖ్య కోసం నారాయణ ఏం చేశాడు? చివరకు అలేఖ్య-అర్జున్ ప్రేమకు ఎలాంటి ముగింపు దక్కిందన్నది తెరపై చూడాల్సిందే.

Advertisement

Details

 జీ5 ఓటీటీలో వీక్షించవచ్చు

రొమాన్స్‌కు సస్పెన్స్‌ను మేళవించి తెరకెక్కిన ఈ సినిమాలో, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతవరకు వెళ్తారన్న అంశాన్ని దర్శకుడు ప్రభావవంతంగా చూపించాడు. తల్లిదండ్రుల పాత్రల్లో నరేష్‌, వాసుకి నటనకు మంచి ప్రశంసలు లభించగా, అంకిత్‌, నీలఖిల నటనకూ మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ 'బ్యూటీ' సినిమాను జీ5 ఓటీటీలో వీక్షించవచ్చు.

Advertisement