LOADING...
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌పై ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్ సినిమా అటకెక్కిందా?
పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌పై ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్ సినిమా అటకెక్కిందా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్‌పై ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్ సినిమా అటకెక్కిందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2026
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో అధికారికంగా ప్రకటించిన రెండు భారీ ప్రాజెక్టులు నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తుండగా, అనూహ్యంగా 'OG 2' సీక్వల్ ముందుకు వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం ఇద్దరు స్టార్ దర్శకుల ప్రాజెక్టుల భవిష్యత్తుపై సందేహాలు రేకెత్తిస్తోంది. మొదటగా, పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పటికీ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఉండటంతో పాటు ప్రాజెక్ట్‌పై స్పష్టత లేకపోవడంతో, ప్రస్తుతం దీనిని పక్కన పెట్టినట్లు సమాచారం.

వివరాలు

సీక్వల్ కథపై పవన్ కళ్యాణ్ ఆసక్తి

మరోవైపు 'OG' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సుజీత్, ఆ తర్వాత నాని హీరోగా 'బ్లడీ రోమియో' అనే సినిమాను రూపొందించాలని భావించారు. కానీ నాని ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో 'బ్లడీ రోమియో' కూడా వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్న మేకర్స్, ముందుగా 'OG 2'ను పట్టాలెక్కించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీక్వల్ కథపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు

ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభం

వినిపిస్తున్న కథనాల ప్రకారం, 'OG 2'కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే నవంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను 2027 చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'OG 2' పూర్తయిన తర్వాత సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా పూర్తిగా నిలిచిపోతుందా? అనే అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement