Loading...
Chiranjeevi: 'విశ్వంభర' రిలీజ్‌పై ట్విస్ట్‌.. వశిష్ఠ డివోషనల్ పోస్ట్‌ వైరల్!
'విశ్వంభర' రిలీజ్‌పై ట్విస్ట్‌.. వశిష్ఠ డివోషనల్ పోస్ట్‌ వైరల్!

Chiranjeevi: 'విశ్వంభర' రిలీజ్‌పై ట్విస్ట్‌.. వశిష్ఠ డివోషనల్ పోస్ట్‌ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
11:44 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'విశ్వంభర' (Vishwambhara), 'కాకా' (Kaaka) సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయా? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే 'కాకా' విడుదల తేదీ ఖరారైంది. జనవరి 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. మరోవైపు 'విశ్వంభర' కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో 'విశ్వంభర' దర్శకుడు వశిష్ఠ (Vassishta) సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. శివుడికి సంబంధించిన ఓ ప్రవచనం వీడియోను ఆయన పంచుకున్నారు.

వివరాలు

విడుదల తేదీపై సందిగ్ధత

'విశ్వంభర' విడుదల తేదీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలోనే వశిష్ఠ ఈ పోస్ట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యం ఉన్న ఫాంటసీ కథాంశంతో 'విశ్వంభర' తెరకెక్కింది. ఇందులో త్రిష, ఆషికా రంగనాథ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇప్పటికే నిర్మాణానంతర పనుల్లో జాప్యం చోటు చేసుకోవడంతో ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడింది. మరోవైపు 'కాకా' చిత్రబృందం మాత్రం ఫుల్‌ జోష్‌లో ఉంది.

త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నారు. ఆయన కుమార్తె పాత్రలో అనస్వర రాజన్‌ నటిస్తున్నారు.

ADVERTISEMENT