Page Loader
Prashanth Neel: స్టార్ హీరోకు ప్రశాంత్‌ నీల్‌ క్షమాపణలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
స్టార్ హీరోకు ప్రశాంత్‌ నీల్‌ క్షమాపణలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్

Prashanth Neel: స్టార్ హీరోకు ప్రశాంత్‌ నీల్‌ క్షమాపణలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2024
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు క్షమాపణలు చెప్పారు. షారుక్ తో పాటు 'డంకీ' టీమ్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఏడాది విడుదలైన 'సలార్', 'డంకీ' సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈ రెండు సినిమాలు ఒక రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. డిసెంబర్ 21న 'డంకీ' విడుదల కాగా, డిసెంబర్ 22న 'సలార్' విడుదలైంది. ఈ విషయంపై ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

వివరాలు 

షారుక్,రాజ్‌కుమార్‌లు చాలా మంచి మనసున్నవారు: నీల్ 

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, ''సలార్‌ను కూడా 'డంకీ' విడుదలైన సమయంలోనే విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది.షారుక్ టీమ్ ముందే తమ విడుదల తేదీని ప్రకటించింది.వారు క్రిస్మస్‌కి రిలీజ్ చేస్తామని ఏడాది ముందుగానే చెప్పారు.అయితే మేము కూడా అదే సమయంలో 'సలార్'ను విడుదల చేశాం.ఈ విషయంలో షారుక్ 'డంకీ' టీమ్‌కు నేను క్షమాపణలు చెబుతున్నాను. రెండు పెద్ద సినిమాలు ఒకే సమయంలో విడుదల కాకుండా ఉండాలి. కానీ,మా జ్యోతిష్యులు ఆ తేదీనే మంచిదని చెప్పారు.అలాగే మరికొన్ని కారణాల వల్ల ఆ టైంలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. షారుక్,రాజ్‌కుమార్‌లు చాలా మంచి మనసున్నవారు.వాళ్లు మమ్మల్ని అర్థం చేసుకున్నారు''అని ఆ వీడియోలో ప్రశాంత్ నీల్ వివరించారు.

వివరాలు 

#NTR31 వర్కింగ్ టైటిల్‌తో సినిమా

ఈ రెండు సినిమాలు మొదటి రోజే మంచి వసూళ్లు సాధించాయి. ప్రశాంత్ నీల్ తన అప్‌కమింగ్ ప్రాజెక్టుల లిస్ట్‌లో మూడు సినిమాలను ప్లాన్ చేశారు. ''సలార్ 2'' (Salaar 2) పేరుతో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ''కేజీయఫ్ 3'' (KGF 3) స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. యశ్, విజయ్ కిరంగదూర్‌ ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు, వారు అందుబాటులోకి రాగానే ''కేజీయఫ్'' మూడో భాగం ప్రారంభిస్తారు. వీటిలో ముందు ఎన్టీఆర్‌తో #NTR31 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి ''డ్రాగన్'' అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.