Loading...
Aakasamlo Oka Tara Trailer: 'ఆకాశంలో ఒక తార' ట్రైలర్‌ విడుదల.. అమ్మాయి కలను నిజం చేసే పాత్రలో దుల్కర్

Aakasamlo Oka Tara Trailer: 'ఆకాశంలో ఒక తార' ట్రైలర్‌ విడుదల.. అమ్మాయి కలను నిజం చేసే పాత్రలో దుల్కర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

'కల్పన కలను నిజం చేసే కృష్ణ కథ..' అంటూ మరో ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన ప్రధాన పాత్రలో పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆకాశంలో ఒక తార' (Aakasamlo Oka Tara). ఈ సినిమాలో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతున్నారు. శ్రుతి హాసన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రల్లో నటించారు.

వివరాలు

నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు..

ఈ చిత్రం నవంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఇందులో వ్యోమగామి కావాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయి కలను నిజం చేసే వ్యక్తిగా దుల్కర్‌ కనిపించారు.

'కృష్ణ' అనే పాత్రలో ఆయన ప్రేక్షకులను అలరించనున్నారు.

ADVERTISEMENT