LOADING...
Aamir Khan : మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ!
మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ!

Aamir Khan : మాజీ భార్యలపై ఆమిర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా చర్చ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' అమీర్ ఖాన్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 60 ఏళ్ల వయసులో మరోసారి జీవిత భాగస్వామి దొరికిందని ఎన్నడూ ఊహించలేదని చెబుతూ తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుతం తనతో ఉన్న ప్రేయసి గౌరీ స్ప్రాట్ గురించి మాట్లాడుతూ, ఆమె ప్రవేశం తన జీవితంలో అపూర్వమైన మార్పులను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆమిర్ మాట్లాడుతూ "నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. నా జీవితంలోకి వచ్చిన రీనా, కిరణ్ ఇద్దరూ అసాధారణ వ్యక్తులు. మేము భార్యాభర్తలుగా విడిపోయినా, మనుషులుగా ఏ మాత్రం విడిపోలేదు. వారిద్దరికీ నా మనసులో ఎప్పటికీ గౌరవం, ప్రేమ ఉంటాయని తెలిపారు.

Details

గౌరీ రావడంతో ప్రశాంతంగా ఉంది

ఇంకా రీనా తల్లిదండ్రులు, కిరణ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ ఇప్పటికీ ఒకే కుటుంబంలా కలిసి ఉంటామని చెప్పారు. పెళ్లి బంధం ముగిసినా, స్నేహం మాత్రం ఇప్పటికీ అలానే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. తన ప్రస్తుత భాగస్వామి గౌరీ గురించి మాట్లాడుతూ 60 ఏళ్లకు నాకు భాగస్వామి దొరికే అవకాశం లేదనుకున్న సమయంలో గౌరీ నా జీవితంలోకి వచ్చింది. ఆమె రావడంతో నాకు ఎంతో ప్రశాంతత, స్థిరత్వం లభించాయి. గౌరీని కలవడం నా అదృష్టమని ఆమిర్ పేర్కొన్నారు. గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం ఆమిర్‌కు చెందిన నిర్మాణ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఈ జంట విమానాశ్రయాలు, వేడుకలు, పబ్లిక్ ఈవెంట్లలో కలిసి కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement