ఆస్కార్ వేదిక మీద మెరుపులు మెరిపించిన ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ విశేషాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ అవార్డుల కార్యక్రమం, అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో డాల్బీ థియేటర్ లో జరిగింది. భారతీయ కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5:30గంటలకు మొదలై 9గంటలకు ముగిసింది.
ఈ ప్రధానోత్సవంలో అతిపెద్ద అవార్డుగా భావించే, ఉత్తమ చిత్రం అవార్డును ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం గెలుచుకుంది. అదొక్క అవార్డు మాత్రమే కాదు ఏకంగా 7అవార్డులను తన ఖాతాలో వేసుకుంది ఈ సినిమా.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ దర్శకుడు అవార్డులను గెల్చుకుంది ఈ చిత్రం.
ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న మిషెల్లీ యో, ఆసియాలోనే తొలిసారి అవార్డ్ గెలుచుకుని రికార్డ్ సృష్టించింది.
ఆస్కార్ అవార్డ్స్
సైన్స్ ఫిక్షన్ లో జోనర్ లో వచ్చిన సినిమా సృష్టించిన రికార్డ్
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్ చిత్రంలో మల్టీ యూనివర్స్ గురించి ఉంటుంది. వేరు వేరు విశ్వాల్లో మనుషులను పోలిన మనుషులు ఉండడం గురించి చాలా ఆసక్తిగా చూపించారు.
సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇండియాలో సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఈ సినిమాను ఇంట్లోనే చూడవచ్చు.
2018లో వచ్చిన షేప్ ఆఫ్ వాటర్ తర్వాత సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉత్తమ చిత్రంగా నిలిచిన సినిమాగా, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నిలిచింది.
మొత్తానికి ఆస్కార్ వేదిక మీద అన్ని పెద్ద అవార్డులను సొంతం చేసుకుని అందరి నోళ్ళలోనూ నానుతోంది ఈ సినిమా.