NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Actor Bala: మలయాళ నటుడిపై మాజీ భార్య ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    Actor Bala: మలయాళ నటుడిపై మాజీ భార్య ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు
    మలయాళ నటుడిపై మాజీ భార్య ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు

    Actor Bala: మలయాళ నటుడిపై మాజీ భార్య ఫిర్యాదు.. అరెస్టు చేసిన పోలీసులు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు బాలాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

    ఆయన మాజీ భార్య అమృతా సురేశ్ ఫిర్యాదు మేరకు, సామాజిక మాధ్యమాల ద్వారా తనతోపాటు తన కుమార్తె పరువు తీస్తున్నాడన్న కారణంతో కొచ్చిలోని కడవంట్ర పోలీసులు బాలాను అదుపులోకి తీసుకున్నారు.

    జువైనల్ జస్టిస్ (చిన్నారుల రక్షణ) చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఎడపల్లిలోని బాలా ఫ్లాట్‌లో ఈ తెల్లవారుజామున ఆయనను పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

    అక్కడ, ఆయనను ప్రశ్నిస్తున్న పోలీసులు ఈ సాయంత్రం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

    బాలా తన కుమార్తెని వేధిస్తున్నాడని గతంలోనే ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే.

    వివరాలు 

    కుమార్తె ఆరోపణలపై స్పందించిన బాలా 

    ఈ కేసు ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండడంతో, అక్కడికి బదిలీ చేసే అవకాశం ఉంది.

    కుమార్తె ఆరోపణలపై స్పందించిన బాలా, ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు.

    తనకు హాని చేయాలని చిన్నప్పటి నుండి తండ్రి ప్రయత్నిస్తున్నాడన్న ఆమె ఆరోపణలను బాలా కొట్టిపడేసి, తనను తండ్రిగా గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నాడు.

    ఈ విషయం తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని పేర్కొన్నాడు.

    అయితే, ఈ ఆరోపణలతో అంగీకరించేది లేదని, అలాగని తనతో వాదించే ఉద్దేశం కూడా లేదని స్పష్టతనిచ్చాడు. కుమార్తెతో వాదించే తండ్రి అసలు మనిషే కాదని చెప్పుకొచ్చాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాలీవుడ్
    మాలీవుడ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    మాలీవుడ్

    Mammotty: స్వలింగ సంపర్క పాత్రలో మమ్ముట్టి.. సినిమాను ఆ దేశాల్లో అందుకే బ్యాన్ చేశారట  మమ్ముట్టి
    official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్  మాలీవుడ్
    Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్  మమ్ముట్టి
    OTT: ఆహా ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న 'ప్రేమలు' ఆహా

    మాలీవుడ్

    Kanakalatha: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత మాలీవుడ్
    Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి! మాలీవుడ్
    Mohanlal: హేమ కమిటీ ఎఫెక్టు.. 'అమ్మ'కు మోహన్ లాల్ టీం రాజీనామా సినిమా
    Mollywood: లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ నటులపై కేసు నమోదు! మాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025