తదుపరి వార్తా కథనం

Master Bharath: చెన్నైలో నటుడు భరత్ తల్లి కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 19, 2025
01:13 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కమలహాసిని గుండెపోటుతో ఆదివారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
ఈ వార్త సినీ వర్గాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఆమె అకాల మరణం భరత్‌ను తీవ్రంగా కలచివేసింది.
తల్లి మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు భరత్‌కు ఫోన్ చేసి సంతాపం తెలియజేస్తూ ధైర్యం చెప్పారు.
బాల నటుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్.. ప్రస్తుతం పలు చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
ఈ సమయంలో భరత్ కుటుంబానికి సినీ పరిశ్రమ నుండి మద్దతు వెల్లువెత్తుతోంది.