Page Loader
Actor Chandrakanth: బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య
బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య

Actor Chandrakanth: బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య

వ్రాసిన వారు Stalin
May 18, 2024
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు. పవిత్ర మరణించడంతో ఆ బాధని తట్టుకోలేక చంద్రకాంత్ నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే చంద్రకాంత్ కి గతంలోనే పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇవ్వకుండానే వదిలేసి పవిత్రతో కలిసి ఉంటున్నాడు. తాజాగా చంద్రకాంత్ ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించింది. చంద్రకాంత్ భార్య శిల్ప మీడియాతో మాట్లాడుతూ.. అయిదేళ్లుగా సీరియల్ నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడు. గతంలో చందు నా వెంటపడి ప్రేమించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Details 

పవిత్ర సడెన్ గా చనిపోవడంతో డిప్రెషన్

త్రినయని సీరియల్ ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర్నుంచి పవిత్రతో సంబంధం మొదలైంది. పవిత్రతో రిలేషన్ లో ఉంటూ నన్ను, పిల్లల్నివదిలేసాడు. చందు నాతో ఐదేళ్లుగా మాట్లాడట్లేదు. పవిత్ర మీద చందు విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు.పవిత్ర మాయలో పడి చందు ఈ విధంగా అయ్యాడు. పవిత్ర సడెన్ గా చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్నాడు.మూడు రోజుల క్రితం చేయి కోసుకున్నాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టాడు.నిన్న మా ఇంట్లో వాళ్ల ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తన ఫ్లాట్ కి మాకు తెలిసిన వాళ్ళని పంపించాము. అక్కడ డోర్ పగలగొట్టి చూస్తే చందు సూసైడ్ చేసుకొని ఉన్నాడని చెప్పారు. నాకు,నా పిల్లలకి న్యాయం జరగాలి అని వ్యాఖ్యలు చేసింది.