Page Loader
Pavitra Jayaram: రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ దుర్మరణం 
రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ దుర్మరణం

Pavitra Jayaram: రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ దుర్మరణం 

వ్రాసిన వారు Stalin
May 12, 2024
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సీరియల్ నటి పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.తెలుగు సీరియల్ త్రినయనిలో తిలోత్తమ పాత్రలో నటించి మెప్పించారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని శేరిపల్లిలో ఈరోజు తెల్లవారుజామున ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పవిత్ర జయరామ్ మరణం టెలివిజన్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది, జీ తెలుగు టీవీ ఛానెల్ ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ''తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు'' అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జీ తెలుగు చేసిన ట్వీట్ 

Details 

కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం

కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరామ్ ప్రారంభంలో కన్నడ టీవీ పరిశ్రమలో జోకలి, రోబోట్ ఫ్యామిలీ, గాలిపాట సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. నిన్నే పెళ్లాడతా వంటి సీరియల్స్‌తో తెలుగులో తనదైన ముద్ర వేసింది. అయితే త్రినాయనిలో ఆమె చేసిన పాత్ర ఆమెకు పేరు తెచ్చిపెట్టింది. ఆమె అకాల మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.