Page Loader
Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్‌ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష 
డ్రంకన్ డ్రైవ్‌ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష

Dalip Tahil: డ్రంకన్ డ్రైవ్‌ కేసు.. సీనియర్ నటుడికి 2 నెలల జైలు శిక్ష 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బాలీవుడ్ నటుడు దలీప్ తాహిల్‌కు డ్రంకన్ డ్రైవ్‌ కేసులో 2నెలల శిక్ష పడింది. 2018లో తాహిల్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ముంబై‌లో గాయాలపాలవడానికి కారణమయ్యారు. ఈ కేసులో దలీప్ తాహిల్‌కు ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2018లో మద్యం మత్తులో ముంబైలో తాహిల్ కారు ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఈ ఘటనలో జెనితా గాంధీ, గౌరవ్ చుగ్ గాయపడ్డారు. ప్రమాదం తర్వాత తాహిల్ పారిపోవడానికి ప్రయత్నాడని, కానీ గణేష్ నిమజ్జనం కారణంగా అతని కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని తాహిల్‌ను అరెస్టు చేశారు.

ప్రమాదం

2018లో బెయిల్‌పై విడుదల 

2018లో తాహిల్‌ను అరెస్టు చేసిన తర్వాత మద్య పరీక్ష కోసం రక్త నమూనాను అందించడానికి ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో అయన కొన్ని రోజులకు బెయిల్‌పై విడుదలయ్యారు. తాహిల్ పోలీస్ స్టేషన్ వద్ద వేచి ఉన్న ఫోటో కూడా అప్పట్లో వైరల్ గా మారింది. అక్టోబర్ 30, 1952న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించిన తాహిల్.. 10 సంవత్సరాల వయస్సులోనే నైనిటాల్‌లోని షేర్‌వుడ్ కళాశాలలో రంగస్థల నటుడిగా పరిచయం అయ్యారు. బాజీగర్ (1993), హమ్ హై రాహీ ప్యార్ కే (1993), రాజా (1995), ఖయామత్ సే ఖయామత్ తక్ (1988) వంటి చిత్రాలతో మంచి గుర్తింపును పొందారు.