LOADING...
Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ 'రేజర్'… టైటిల్ గ్లింప్స్‌తోనే హై వోల్టేజ్ షాక్!
టైటిల్ గ్లింప్స్‌తోనే హై వోల్టేజ్ షాక్!

Ravi Babu : రవిబాబు కొత్త సినిమా టైటిల్ 'రేజర్'… టైటిల్ గ్లింప్స్‌తోనే హై వోల్టేజ్ షాక్!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

కమెడియన్‌గా,విలన్‌గా, నటుడిగా తనదైన ముద్ర వేసుకున్న రవిబాబు... దర్శకుడిగానూ తొలి నుంచే కొత్తదనం ఉన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అల్లరి, అనసూయ, నచ్చావులే, నువ్విలా, అమరావతి, అవును, ఆవిరి, క్రష్ వంటి విభిన్న కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన సినిమాలు సులువుగా హిట్లుగా నిలిచి ప్రేక్షకుల మెప్పు పొందాయి. దర్శకుడిగా కొంత విరామం తీసుకున్న రవిబాబు, ఇటీవల మళ్లీ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే 'ఏనుగుతొండం ఘటికాచలం' అనే చిత్రంతో ఈటీవీ విన్ ఓటీటీలో దర్శనమిచ్చిన రవిబాబు, తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు.

వివరాలు 

2026 సమ్మర్‌లో విడుదల

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ, చిత్రానికి 'రేజర్' అనే పేరును ఖరారు చేసినట్టు వెల్లడించాడు. గ్లింప్స్‌లో మనుషులను దారుణంగా ముక్కలుగా నరికే సన్నివేశాలు చూపిస్తూ ఆసక్తిని రేకెత్తించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా రవిబాబే నటిస్తున్నట్టు సమాచారం. 'రేజర్' సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. టైటిల్ గ్లింప్స్‌తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, ఈసారి రవిబాబు ఎలాంటి స్థాయిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాడో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement