Actor Shivaji : 'దండోరా' ప్రీ రిలీజ్ వివాదంపై శివాజీ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
హీరోయిన్ దుస్తులను ఉద్దేశించి తానూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని నటుడు శివాజీ బుధవారం స్పష్టం చేశారు. అయితే, ఆ సందర్భంలో రెండు అసభ్య పదాలను ఉపయోగించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈవెంట్ తర్వాత వెంటనే తన పొరపాటును గ్రహించినట్లు తెలిపారు.
వివరాలు
నేను నిద్రపోయి 36 గంటలైంది..
ఆ రోజు వేదికపై ఉన్న నా తోటి నటీనటులు, ఆడ బిడ్డలకు క్షమాపణలు. అలాంటి పదాలు తగదు. 30 ఏళ్ల సినీ జీవితంలో ఎప్పుడూ అలా మాట్లాడలేదు. రాజకీయాల్లోనూ ఏ రోజూ ఎవరినీ ఒక చిన్న మాట అనలేదు. ఈవెంట్‌లో ఇలా ఎందుకు మాట్లాడానా అనిబాధపడ్డాను. బయటకు రాగానే తప్పుగా మాట్లాడానని గ్రహించాను. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుతున్నా. అయినప్పటికీ, నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉంటా. ఎవరికీ భయం లేదు. కానీ ఆ రెండు అసభ్య పదాలు తప్పే," అని శివాజీ తెలిపారు.
వివరాలు
నేనే ప్రెస్‌మీట్ పెడతా: శివాజీ
ఆ వ్యాఖ్యల తర్వాత ఆయనలో అంతర్మథనం మొదలైంది, రాజకీయాల్లోనూ తప్పు మాట్లాడని నేను ఇలా ఎలా మాట్లాడానా? అని ఆలోచిస్తూ ఉండిపోయా. అందుకే సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దాని నుంచి బయటకు వచ్చి నేనే ప్రెస్‌మీట్ పెడతానని నిర్మాతకు చెప్పాను. నిర్మాత 'వివాదమవుతుందేమో' అని అన్నారు. కానీ, సినిమాకు డబ్బులు తీసుకున్నందుకు నా వంతు ప్రమోషన్ చేయాలి కదా! ప్రేక్షకులు అందరూ కచ్చితంగా థియేటర్‌లో సినిమా చూడండి.ఈ 'దండోరా' కథ కుల వ్యవస్థను ఎదుర్కొంటూ, సమాజంలోని అసమానతలను స్పృశిస్తుంది. అలాంటి మంచి కథతో 'దండోరా'ను తీర్చిదిద్దారు అని చెప్పారు.
వివరాలు
ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పటానికి నేనెవర్ని..
"తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సినీ వ్యక్తులు, సహా చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటిగారు స్త్రీ ప్రాధాన్యతను గురించి చెప్పారు. సినిమాల్లో ఎలా చేసినా, , బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా ఉండాలని సూచించారు. నేను ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం, లులూ మాల్‌లో నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఇబ్బంది. తరువాత సమంత గారిని కూడా అలాగే వేధించారు. ఒకప్పుడు రమ్యకృష్ణ, జయసుధ, విజయశాంతి గారి పేర్లతో చీరలు విక్రయమయ్యేవి. ఎవరికీ ప్రత్యేక డ్రెస్ వేసుకోవాలని చెప్పలేదూ. సమాజంలో ఏ రుగ్మతలైనా, సినిమాల వల్లే చెడిపోతున్నాయని విన్నాను. సినిమా ద్వారా నా కుటుంబం జీవిస్తోంది, కాబట్టి నా అభిప్రాయం వ్యక్తం చేయాల్సి వచ్చింది," అని వివరించారు.
వివరాలు
అడిగితే బాగుండేది.. ఆవేశంగా ఫిర్యాదులు చేశారు..
"తప్పుగా మాట్లాడానని గ్రహించిన తర్వాత, మొదట నా భార్యకు క్షమాపణ చెప్పాను. వెంటనే ఓ వీడియో రికార్డు చేసి చిత్ర టీమ్‌కి పంపాను. కానీ దీన్ని పెద్దగా చేయొద్దని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత కొన్ని ట్వీట్లు చూసాను. చిన్మయి, అనసూయగారిని ట్యాగ్ చేయడం మొదలు పెట్టారు. నా వైపు తప్పు దొర్లింది కాబట్టి, వారు ఏమన్నా సర్దుకుపోవాల్సిందే. ఇంకా క్షమాపణ చెప్పాల్సి వస్తే, చెబుతాను. నా భార్య, పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఇంత వరకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. కొందరు ఆవేశంతో ఫిర్యాదు చేశారు, కానీ నేరుగా 'క్షమాపణ చెప్పండి' అనలేదు. ఒక్క సుప్రియ గారు మాత్రమే ఫోన్ చేశారు, ఆమెకు కూడా క్షమాపణ చెప్పా," అని శివాజీ వివరించారు.