మోహన్ లాల్ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్: ఏకంగా పాన్ ఇండియాపై గురి?
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోగా మారిన రోషన్, ఆ తర్వాత పెళ్ళి సందD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమా, మంచి వసూళ్ళు సాధించింది.
ప్రస్తుతం రోషన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఛాంపియన్ అనే సినిమా ఒకటైతే, వేదాంశ్ పిక్చర్స్ బ్యానర్ లో ఇంకా పేరు పెట్టని సినిమా మరొకటి.
ఇవేగాక తాజాగా రోషన్ కు మోహన్ లాల్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని టాక్. మోహన్ లాల్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో నందకిషోర్ దర్శకత్వంలో వృషభ అనే సినిమా రూపొందుతోంది.
Details
ఏక్తా కపూర్ నిర్మాతగా వృషభ
ఈ సినిమాలో మోహన్ లాల్ కొడుకు పాత్రలో నటించడానికి రోషన్ కు అవకాశం వచ్చిందని చెప్పుకుంటున్నారు.
తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న వృషభ సినిమా, తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథగా ఉంటుందని అంటున్నారు.
కొడుకు పాత్రకు బాగా ఇంపార్టెన్స్ ఉంటుందనీ, రోషన్ కు మంచి అవకాశం దక్కిందనీ, పాన్ ఇండియా లెవెల్ లో రోషన్ కు మంచి గుర్తింపు వస్తుందని మాట్లాడుకుంటున్నారు.
వృషభ సినిమాను బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమాను 2024లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.