Viswanath And Sons: 28 ఏళ్లుగా చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య
ఈ వార్తాకథనం ఏంటి
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా ప్రతి ఒక్కరినీ ప్రేమలో పడేలా చేస్తుందని హీరో సూర్య అన్నారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ.. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే నవీన్‌తో పాటు సినీ కుటుంబ సభ్యులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
వివరాలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీస్సులతో సినిమా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులు, వారి కుటుంబ సభ్యులకు నమస్కారం చెప్పారు.
గత 28 ఏళ్లుగా అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు.
నాగవంశీ, వెంకీ వల్లే ఇలాంటి మంచి సినిమా చేయడం సాధ్యమైందని చెప్పారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను థియేటర్లలో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రేమిస్తారని నమ్ముతున్నానన్నారు.
సినిమా ప్రారంభం నుంచే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీస్సులు తమకు ఉన్నాయని సూర్య తెలిపారు.
ఆయన ఎప్పుడూ తమకు అండగా నిలిచారని చెప్పారు. కుటుంబ విలువలను ప్రతిబింబించే మంచి సినిమాలను త్రివిక్రమ్ ఈ తరానికి నచ్చేలా అందించారని పేర్కొన్నారు.
వెంకీ అట్లూరి కూడా త్రివిక్రమ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నారని అన్నారు.
వివరాలు
వెంకీ అట్లూరితో మరోసారి సినిమా..
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని ప్రశంసించారు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని సూర్య చెప్పారు.
20 ఏళ్ల క్రితం 'గజినీ' సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రలో తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించిన విషయాన్ని సూర్య గుర్తు చేసుకున్నారు.
అంత గొప్పగా పాత్రను రాయడం మామూలు విషయం కాదని అన్నారు.
వెంకీ అట్లూరితో మరోసారి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు.
నటుడు శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రేక్షకులు దత్త పుత్రులుగా భావించారని, 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' సినిమాకు ఎంతో ప్రేమను అందించారని గుర్తుచేశారు.
'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాకు కూడా అదే స్థాయిలో ప్రేమను అందించాలని కోరారు.
వివరాలు
అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక..
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలిపారు.
సినీ పరిశ్రమకు అండగా ఉంటామని చెప్పడంతో పాటు గద్దర్ అవార్డులతో తమను ప్రోత్సహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
డబ్బులు ఖర్చు చేసి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి, నచ్చితే పదిమందికి చెప్పే ప్రేక్షకుల నుంచి.. సినిమాలోని తప్పొప్పులను ఎత్తిచూపే రివ్యూయర్ల వరకు ప్రతి ఒక్కరూ తనకు ముఖ్యమేనని వెంకీ అట్లూరి అన్నారు.
తాను ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకుని మరింత బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు.