LOADING...
Actor Vishal: రాజేంద్ర ప్రసాద్‌పై తమిళ హీరో ఫైర్.. ఎందుకంటే?
రాజేంద్ర ప్రసాద్‌పై తమిళ హీరో ఫైర్.. ఎందుకంటే?

Actor Vishal: రాజేంద్ర ప్రసాద్‌పై తమిళ హీరో ఫైర్.. ఎందుకంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Mar 12, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు దక్షిణ భారత సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఈమధ్యనే 'కత్తి కాంతారావు జాతీయ అవార్డు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నటుడు కాంతారావు గొప్పతనాన్ని వివరించే సందర్భంలో.. తమిళ సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాంతారావు పేరు వినగానే ఎంజీఆర్ భయపడేవారని ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ క్రిష్ణ తీవ్రంగా స్పందించారు.

వివరాలు

రాజేంద్ర ప్రసాద్ 'సారీ' చెప్పాలని డిమాండ్

రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు కోట్లాది మంది అభిమానించే ఎంజీఆర్ గురించి అలాంటి కామెంట్స్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఒక గొప్ప వ్యక్తిని ప్రశంసించడానికి మరొక మహానుభావుడిని తక్కువ చేసి మాట్లాడటం సరైన విధానం కాదని విశాల్ అన్నారు. అలాగే ఆయన చేసిన కామెంట్స్ తమిళ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి ఎంజీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.

వివరాలు

తమిళనాడులో అలజడి..

గతంలో కూడా పలువురు నటులపై రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. తాజా ఘటనతో సినీ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా తమిళనాడులో కూడా ఈ విషయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Advertisement