Siddique: నన్ను రేప్ చేశాడు.. లైగింక ఆరోపణలతో కీలక పదవికి రాజీనామా చేసిన నిర్మాత
మలయాళ సినీ రంగంలో మహిళల ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్టు ప్రస్తుతం ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. పలువురు నటీమణులు ముందుకొచ్చి దర్శక, నిర్మాణతలపై కీలక ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీపై లైంగిక్ ఆరోపణలు వెలువడ్డాయి. తనతో అభ్యంతకరంగా ప్రవర్తించాడని నటి రేవతి సంపత్ పేర్కొన్నారు. దీంతో సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు.
మలయాళ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న రేవతి సంపత్ వ్యాఖ్యలు
సిద్ధిఖీ ట్రాప్ చేసి తనను రేప్ చేశాడని, తనతో పాటు తన స్నేహితులను కూడా లైంగికంగా సిద్ధిఖీ వేధించాడని రేవంత్ సంపత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సిద్ధిఖీ నటించిన సుఖమయిరిక్కట్టే ప్రీమియర్ షోకు తనని ఆహ్వానించి, షో ముగిసిన తర్వాత తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు తీసుకెళ్లాడని పేర్కొంది. తర్వాత హోటల్ రూమ్‌లో సిద్ధిఖీ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. హోటల్‌లో ఉన్న గంట ఎంతో నరకం అనుభవించానని, కానీ ఆ భయానక అనుభవం నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టిందని రేవతి సంపత్ చెప్పింది.