Page Loader
Hina Khan: క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్.. తాజా లుక్ వైరల్
క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్.. తాజా లుక్ వైరల్

Hina Khan: క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న నటి హీనా ఖాన్.. తాజా లుక్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటి హీనా ఖాన్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆమె, తరచూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఇటీవల ఆమె జీవితంలో అనూహ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి ప్రవేశించింది. కొన్ని రోజులుగా హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 3తో పోరాడుతోంది. చికిత్సలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిగతులపై సమాచారం ఇచ్చేందుకు సోషల్ మీడియాను వినియోగిస్తోంది. ఇప్పటికే కీమోథెరపీ చికిత్సల కారణంగా ఆమె జుట్టును కోల్పోయింది. అలాగే కనుబొమ్మలూ ఊడిపోవడంతో తన లుక్‌లో వచ్చిన మార్పుల్ని కూడా ఓపెన్‌గా పంచుకుంది.

Details

త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను

ఇటీవలే ఒక ఫొటో షేర్ చేసిన హీనా.. "కీమోథెరపీ వల్ల నా కనురెప్పలు కూడా రాలిపోయాయి. కానీ షూట్ కోసం వాటిని ధరించాల్సి వచ్చింది. నా ఒరిజినల్ కనురెప్పల్నే గౌరవంగా చూస్తున్నానని అంటూ తెలిపింది. అంతేకాదు తలపై జుట్టు ఊడిపోతున్న నేపథ్యంలో తాను గుండు చేయించుకున్న ఫోటోను కూడా అభిమానులతో పంచుకుంది. క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొంటానని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని ఆమె ధైర్యంగా చెప్పింది. అయితే, ఈ ఫోటోలపై కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా ఆమె గోళ్లపై నెయిల్ పాలిష్ కనిపించడాన్ని ట్రోల్ చేస్తూ అసమయంగా అవ‌స‌ర‌మా అని ప్రశ్నించారు. దీనిపై హీనా ఖాన్ స్పష్టత ఇస్తూ, క్యాన్సర్ చికిత్సల కారణంగా గోర్లు రంగు మారిపోవటంతోనే నెయిల్ పాలిష్ వేసుకున్నట్లు తెలిపింది.

Details

మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లు

ఇక తాజా పోస్టులో హీనా నైట్ డ్రెస్‌లో, రెండు చిన్న పిలకలతో కనిపించింది. "ఎడాదిన్నర తర్వాత నా జుట్టును పిగ్‌టైల్స్‌లో పెట్టుకున్నాను. నా జుట్టును ఎంతగా మిస్ అయ్యానో చెప్పలేను. వన్ డే అట్ ఎ టైమ్.. ఓఫ్ఫ్.. చిన్న పిలకలు" అంటూ క్యాప్షన్ జత చేసింది. ఆమె పోస్ట్ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే మరోవైపు కొంతమంది విమర్శలు చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నప్పటికీ, వారిని తప్పుపడుతూ హీనాను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.