Keerthy Suresh: నటి కీర్తి సురేష్‌కు అంతర్జాతీయ గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటి కీర్తి సురేశ్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ (United Nations International Children's Emergency Fund) భారత విభాగం ఆమెను సెలబ్రిటీ అడ్వకేట్‌గా అధికారికంగా నియమించింది. ఈ కొత్త బాధ్యతలు అందుకోవడం తనకు ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నట్టు కీర్తి సురేశ్ పేర్కొన్నారు. యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రీ మాట్లాడుతూ కీర్తి సురేశ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రేక్షకులతో ఆమెకున్న బలమైన అనుబంధం, పిల్లల హక్కులు మరియు వారి శ్రేయస్సు కోసం పోరాడటానికి శక్తివంతమైన వేదికగా మారుతుందని వెల్లడించారు.
Details
చాలా అదృష్టంగా ఉంది
అనంతరం కీర్తి సురేశ్ స్పందిస్తూ ప్రతి బాలుడికి సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. వారి నేపథ్యమేమైనా సరే, అందరికీ అభివృద్ధి చెందే అవకాశం కల్పించేందుకు యూనిసెఫ్ ఇండియాతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా ఉందని అన్నారు. పిల్లల శ్రేయస్సే దేశ బలానికి పునాదని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే — కీర్తి నటించిన 'రివాల్వర్ రీటా' ఈ నెల 28న విడుదల కానుంది.