
Payal Rajput: నటి పాయల్ ఇంట విషాదం.. తండ్రి మృతిపై రెండు రోజుల తర్వాత భావోద్వేగ పోస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను పాయల్ రాజ్‌పుత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక భావోద్వేగానికి గురైన పాయల్ ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను నాన్న అంటూ హృదయవిదారక పోస్ట్ చేశారు.
Details
ప్రముఖుల సంతాపం
క్యాన్సర్‌ను మీరు జయిస్తారని నమ్మాను. మీకు బలాన్నిచ్చేందుకు నేను చేయగలిగినంత చేశాను. మిమ్మల్ని కాపాడుకోవాలనే యత్నంలో నేను ఓడిపోయాను. క్షమించండి నాన్నా అని రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమెకు ధైర్యం చెప్పుతున్నారు. 'ఆయన ఆత్మ ఎప్పుడూ నీతోనే ఉంటుందని నటి లక్ష్మీరాయ్ వ్యాఖ్యానించారు. పాయల్ కుటుంబానికి శాంతి కలగాలంటూ అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.